Webdunia - Bharat's app for daily news and videos

Install App

పకడ్బందీగా 'జగనన్న అమ్మ ఒడి'

Written By ఎం
Updated: సోమవారం, 18 నవంబరు 2019 (15:53 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'జగనన్న అమ్మ ఒడి' పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన విధి విధానాలపై డీఈవోలు, ఎంఈవోలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టి పూర్తి చేయాలని, సందేహాలను నివృత్తి చేసేందుకు డీఈవో కార్యాలయంలో 24 గంటలూ పనిచేసేలా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ ఆదేశించారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేశారు. 
 
షెడ్యూల్‌ ఇలా... 
* పాఠశాల చైల్డ్‌ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెల 19లోగా ధ్రువీకరించాలి. ఆ జాబితాను గ్రామ సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకునికి ఈ నెల 24న పంపించాలి.
 
*  ఈ జాబితాను 25వ తేదీ నాటికి గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో పెట్టాలి. 
 
* వీటిపై అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకునికి తెలపాలి.
 
* ఆధార్‌ నంబర్, ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ లేని విద్యార్థుల వివరాలను  గ్రామ వలంటీర్ల ద్వారా నవంబరు 25 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు సేకరించాలి.
 
 
* ఆ సమాచారాన్ని విద్యా, సంక్షేమ సహాయకుడు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి నేరుగా అందించాలి.
 
* ప్రధానోపాధ్యాయుడు ఆ సమాచారాన్ని ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ పోర్టల్‌లో డిసెంబరు 5 నాటికి అప్‌డేట్‌ చేయాలి. 
 
* అర్హులైన తల్లుల/సంరక్షకుల ముసాయిదా జాబితాను డిసెంబరు 8 నాటికి రూపొందించి గ్రామ సచివాలయంలోని విద్యా, సంక్షేమ సహాయకునికి ప్రధానోపాధ్యాయులు పంపించాలి. 
 
* ముసాయిదా జాబితాను  సచివాలయంలో విద్యా, సంక్షేమ సహాయకుడు గ్రామ స్థాయిలో డిసెంబర్‌ 9న ప్రకటించాలి.
 
* ప్రకటిత సమాచారంపై గ్రామస్తులు లేదా లబ్ధిదారులు అభ్యంతరాలు వ్యక్తం చేయటానికి 3 రోజులు గడువు ఇస్తారు.
 
* ముసాయిదా జాబితాకు డిసెంబర్‌ 15 నుంచి 18లోగా గ్రామసభ ఆమోదం పొందాలి.
 
 ఆమోద జాబితాను గ్రామ సచివాలయ సహాయకుడు డిసెంబర్‌ 20 నాటికి అందజేయాలి.
 
* ఆ జాబితాలను ప్రధానోపాధ్యాయుడు ఎంఈవో ద్వారా డీఈవోకు డిసెంబర్‌ 23లోగా పంపించాలి. డీఈవో డిసెంబర్‌ 24 నాటికి కలెక్టర్‌ ఆమోదం కోసం సమర్పించాలి. 

అన్నీ చూడండి

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

Vijay Deverakonda: నేను Unhype అనే మంచి స్కిన్ కేర్ వాడుతున్నా: విజయ్ దేవరకొండ

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments