శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (09:14 IST)

మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకున్న ఏపీ.. ఇప్పటికే రూ.25 వేల కోట్లు

currency
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జరిగే సెక్యూరిటీ వేలంలో పాల్గొనుంది. 18, 20, 22, 25 ఏళ్ల కాల పరిమితితో తీర్చేలా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఈ మొత్తాన్ని సేకరించనుంది. దీంతో కలిపితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.25 వేల కోట్లు అప్పులు చేసినట్టు లెక్క. ఈ నిధులు బుధవారం ప్రభుత్వ ఖజానాకు జమ కానున్నాయి.
 
రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి తాజాగా సేకరిస్తున్న రూ.4 వేల కోట్ల రుణాన్ని తన అనుకూల గుత్తేదార్లకు చెల్లించాలని యోచిస్తోందని టీడీపీ నేత జీవీ రెడ్డి ఆరోపించారు. 'సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలోనే ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంటోంది. ఈ సొమ్మును వైకాపా అనుకూల కాంట్రాక్టర్లకు బదలాయించనుంది' అని ఆరోపించారు.