ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2024 (16:21 IST)

ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే... పవన్‌కు పంచాయతీ రాజ్... అనితకు హోం

pawan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోని సభ్యులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్‌ కల్యాణ్‌‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌‌కు విద్య (హెచ్‌ఆర్‌డీ), ఐటీ, ఆర్టీజీ శాఖలు ఇవ్వగా, కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ అప్పగించారు. 
 
 
చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి - టీడీపీ - సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
 
పవన్‌ కల్యాణ్‌ - ఉప ముఖ్యమంత్రి - జనసేన - పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ - పర్యావరణం, శాస్త్ర, సాంకేతికత
 
నారా లోకేశ్‌ - టీడీపీ - విద్య (మానవ వనరుల అభివృద్ధి); ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, ఆర్టీజీ
 
అచ్చెన్నాయుడు - తెదేపా - వ్యవసాయం; సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్థక, పాడి అభివృద్ధి & మత్స్య
 
కొల్లు రవీంద్ర - తెదేపా - గనులు & భూగర్భ; అబ్కారీ
 
నాదెండ్ల మనోహర్‌ - జనసేన - ఆహార, పౌర సరఫరాలు; వినియోగదారుల వ్యవహారాలు
 
పి.నారాయణ - తెదేపా - పురపాలక & పట్టణాభివృద్ధి
 
వంగలపూడి అనిత - తెదేపా - హోం మరియు విపత్తు నిర్వహణ
 
సత్యకుమార్‌ యాదవ్‌ - భాజపా - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య 
 
ఎన్‌. రామానాయుడు - తెదేపా - జలవనరుల అభివృద్ధి 
 
ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌ - తెదేపా - న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమం
 
ఆనం రామనారాయణ రెడ్డి - తెదేపా - దేవదాయ శాఖ 
 
కందుల దుర్గేశ్‌ - జనసేన - పర్యటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ
 
పయ్యావుల కేశవ్‌ - తెదేపా - ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు
 
అనగాని సత్యప్రసాద్‌ - తెదేపా - రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌
 
కొలుసు పార్థసారథి - తెదేపా - గృహ, సమాచార - పౌరసంబంధాలు
 
బాలవీరాంజనేయస్వామి - తెదేపా - సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయం, విలేజ్‌ వలంటీర్‌
 
గొట్టిపాటి రవి - తెదేపా - విద్యుత్తు శాఖ 
 
జి. సంధ్యారాణి - తెదేపా - మహిళా, శిశు సంక్షేమం,  గిరిజన సంక్షేమం
 
బీసీ జనార్దన్‌ రెడ్డి - తెదేపా - రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
 
టీజీ భరత్‌ - తెదేపా - పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి 
 
ఎస్‌.సవిత - తెదేపా - బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, హ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌
 
వాసంశెట్టి సుభాష్‌ - తెదేపా - కార్మిక - కర్మాగార - బాయిలర్స్‌, వైద్య బీమా సేవలు
 
కొండపల్లి శ్రీనివాస్‌ - తెదేపా - ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ సాధికార, సంబంధాలు
 
ఎం. రామ్‌ప్రసాద్‌ రెడ్డి - తెదేపా - రవాణా, యువజన మరియు క్రీడలు