శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2024 (13:14 IST)

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు ఎపుడు?

andhra pradesh map
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, ఆయన గురువారం సచివాలయంలో బాధ్యతలు కూడా స్వీకరించారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నియమితులయ్యారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి మాత్రం ఇంకా శాఖల కేటాయింపు జరగలేదు. దీంతో వారు ఇంకా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించలేదు. 
 
ముఖ్యమంత్రిగా చంద్రబాబు గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. వారికి ఇంకా శాఖలు కేటాయించలేదు. రేపటిలోగా మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి తొలి సమావేశం జరగనుంది. ఈ నెల 19న అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. అదేసమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలను కూడా అసెంబ్లీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.