1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 మే 2016 (15:10 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు : డిప్యూటీ సీఎం కేఈ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కక్ష కట్టి.. చిన్నచూపు చూస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంభిస్తోందన్నారు. 
 
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు 10 యేళ్లు కావాలని డిమాండ్‌ చేసిన బీజేపీ నేతలు.. నేడు అదే హోదా ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు.
 
ఇకపోతే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కొత్త సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.విభజన చట్టం ప్రకారం... కొత్తగా నిర్మించే సాగునీటి పథకాలకు ఎపెక్స్‌, కేంద్ర జలసంఘం, గోదావరి, కృష్ణా బోర్డుల అనుమతులు ఉండాలన్నారు.