సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (16:44 IST)

కోడలి తల తెగనరికిన అత్త... తల చేతపట్టుకుని ఠాణాకెళ్లింది...

murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో గురువారం దారుణం జరిగింది. తన మాటకు ఎదురు చెప్పిన కొడలి తల అత్త తెగనరికింది. ఆ తలను చేతపట్టుకుని స్థానిక పోలీస్ స్టేషనుకు వెళ్లి లొంగిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలం కె.రామాపురంలో సుబ్బమ్మ నివసిస్తుంది. కోడలు వసుంధర (35)తో కలిసి ఆమెకు గత కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం ఆవేశంతో ఊగిపోయిన సుబ్బమ్మ.. కోడలు వసుంధరపై కత్తితో దాడి చేసింది. ఈ క్రమంలో చేతికి చిక్కిన కత్తి తీసుకుని కోడలి తల తెగనరికింది. 
 
ఆ తర్వాత ఆ తల చేతపట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. తన కోడలిని తానే హత్య చేశానని పోలీసులకు చెప్పింది. కోడలి తలతో సుబ్బమ్మ వీధిలో నడుచుకుంటూ వెళ్లడాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.