ఆంధ్ర ప్రదేశ్ కొత్త సీఎస్ గా ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఛీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ ఎంపిక అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సమీర్ శర్మను కొత్త సీఎస్ గా నియమిస్తూ, జీవో విడుదల చేసింది. ఇప్పటికీ పనిచేస్తున్న సీ.ఎస్. ఆదిత్యనాద్ దాస్ ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు.
అందుకే ఆయన స్థానంలో 1985 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మను నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎంపిక అయిన ఛీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ వచ్చే అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.