శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (16:36 IST)

ప్రత్తిపాటి పదవికి మూడిందా...? జగన్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తారా..? బాబు ప్లానేంటి?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రత్తిపాటి పుల్లరావుపై అగ్రిగోల్డ్ వ్యవహారంపై ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పిందే నిజమైతే మంత్రి ప్రత్తిపాటి పుల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రత్తిపాటి పుల్లరావుపై అగ్రిగోల్డ్ వ్యవహారంపై ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పిందే నిజమైతే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును అసెంబ్లీ నుంచి వెలివేద్దామని అన్నారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి చెప్పేది అవాస్తవమని తేలినా ఆయనను వెలివేయాల్సిన అవసరం ఉందన్నారు. 
 
ప్రత్తిపాటి పుల్లారావు ఇప్పటికే తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారనీ, కాబట్టి జగన్ మోహన్ రెడ్డి ఆ సవాలును స్వీకరించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రత్తిపాటి పుల్లారావు తనపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు కనుక న్యాయ విచారణలో మంత్రి చెప్పింది తప్పని తేలితే ఆయనను సభ నుంచి వెలివేద్దామనీ, ఒకవేళ ప్రతిపక్ష నేత జగన్‌ ఆరోపణలు తప్పని రుజువైతే ఆయనను కూడా సభ నుంచి వెలివేద్దామని చెప్పారు. 
 
ఈ వ్యవహారంలో మంత్రి పుల్లారావో లేదంటే జగన్ మోహన్ రెడ్డో ఎవరో ఒకరే ఉండాలని అన్నారు. ఈ వ్యవహారంపై రేపటి అసెంబ్లీలో తేలుద్దామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.