సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 23 డిశెంబరు 2021 (16:35 IST)

పాపం స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ... క‌బ‌డ్డీ ఆడుతూ...కుప్ప‌కూలి!

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మ‌నేని సీతారామ్ పాపం క‌బ‌డ్డీ ఆడుతూ కుప్ప‌కూలిపోయారు. పిల్ల‌ల‌తో స‌ర‌దాగా కబడ్డీ ఆడుతూ స్పీకర్ తమ్మినేని అదుపుతప్పి కింద పడిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సీఎం కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభించిన అనంతరం తమ్మినేని కబడ్డీ ఆడారు.


ఈ క్రమంలోనే ఆయన అదుపుతప్పి కింద పడిపోయారు. కూత‌కు వెళ్ళిన ఆయ‌న ఒక్కొక్క ఆట‌డ‌గాడిని ట‌చ్ చేసే ప్ర‌య‌త్నంలో వేగంగా వెన‌కు తిరిగి వెళుతూ, అదుపు త‌ప్పి ఒక్క‌సారిగా కుప్ప‌కూలి ప‌డిపోయారు. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి కంగారుప‌డిన అధికారులు చివ‌రికి తేరుకుని, తమ్మినేనిని పైకి లేపి సపర్యలు చేశారు.