శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (13:23 IST)

క‌బ‌డ్డీ కూత పెడుతూ అదర గొట్టిన రోజా.. వీడియోలు వైరల్

న‌గ‌రి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏది చేసినా... ఏం మాట్లాడినా సంచలనమే. రాజకీయాలతో పాటు టీవీ షోలతో బిజీగా వుండే.. రోజా కొత్త అవతారం ఎత్తారు. కాసేపు కబడ్డీ ప్లేయ‌ర్‌గా మారారు. త‌న భ‌ర్త సెల్వ‌మ‌ణితో క‌లిసి క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ అంటూ కోర్టులోకి దిగి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఈ క‌బ‌డ్డీ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర్‌ల్ అవుతున్నాయి. రోజా జ‌న్మ‌దినాన్ని  పుర‌స్క‌రించుకొని రోజా ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌లు క్రీడాపోటీల‌ను నిర్వ‌హిస్తుంటారు.
 
ఇందులో భాగంగానే ఈ సంవ‌త్స‌రం కూడ న‌గ‌రి డిగ్రీ క‌ళాశాల‌ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ మీట్ నిర్వ‌హిస్తున్నారు.  ఈ రోజు నుంచి న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు  జ‌రిగే స్పోర్ట్స్ మీట్ ను సోమ‌వారం రోజా దంపతులు ఆరంభం చేశారు. ప్రారంభించిన వెంట‌నే రోజా దంపతులు కాసేపు విద్యార్థుల‌తో క‌బ‌డ్డీ ఆడారు. వేర్వేరు గ్రూపులుగా విడిపోయి క‌బ‌డ్డీలో త‌ల‌ప‌డ్డారు. ఈ త‌రుణంలో క‌బ‌డ్డీ కూత పెడుతూ బ‌రిలోకి దిగిన రోజా ఫోటోలు, వీడియోలు వైర‌ల‌య్యాయి.