మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (15:29 IST)

16న భేటీకానున్న ఏపీ మంత్రివర్గం - అదే ప్రధాన అజెండానా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16వ తేదీన జరుగనుంది. ఈ భేటీ 16వ తేదీ గురువారం ఉదయం 11 గంటలు జరుగనుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయం‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. 
 
ఇందులో ప్రధానంగా శాసనసభ వర్షాకాల సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమావేశంలో కరోనా పరిస్థితి అలాగే సిఎం జగన్ ఢిల్లీ పర్యటన, అలాగే జలవనరుల అంశాల గురించి చర్చిస్తారు.
 
ముఖ్యంగా, ఫీజు రియంబర్స్‌మెంట్‌, అమ్మ ఒడి పథకం నిధులు జమపై ఏపీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో దాని గురించి కూడా చర్చించే అవకాశంవుంది. అలాగే సింహాచలం భూముల విషయంలో సిబిఐ విచారణకు ఏపీ ప్రభుత్వం కోరే అవకాశం ఉందని తెలుస్తుంది. 
 
అన్నిటికంటే ముఖ్యంగా ఏపీలో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. ఈ రోడ్ల దుస్థితిపై విపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి. ఈ క్రమంలో రోడ్ల పరిస్థితి, మరమ్మతుల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.