శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2024 (19:32 IST)

గిరిజనులతో కలిసి చిందేసిన చంద్రబాబు నాయుడు- వీడియో వైరల్

Chandrababu
Chandrababu
ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గిరిజనులు, ఇతర ఎస్టీ సంఘాలతో బాబు సంభాషించారు. 
 
ఆసక్తికరమైన విషయమేమిటంటే, శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గిరిజనులతో కలిసి చిందులేశారు. బాబు గిరిజనులతో కలిసి వారి సంప్రదాయ బాణీలకు అనుగుణంగా నృత్యం చేస్తూ కనిపించారు. ఈ దృశ్యం చూస్తున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా తన పనిపై సీరియస్‌గా వుండే చంద్రబాబు కాస్త రిలాక్స్‌గా ఉంటూ గిరిజనులతో సరదాగా గడిపారు.
 
అంతేకాదు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన సంప్రదాయ వాయిద్యాన్ని కూడా బాబు మోగించారు. గిరిజనులు తనకు తెచ్చే కాఫీ, తేనె ఉత్పత్తులను కూడా అతను సేకరించారు. బాబు గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, గిరిజనుల సంప్రదాయ వాయిద్యాన్ని మోగిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాయి.