మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (15:11 IST)

ఏడుకొండలు ఇంటిలో కాఫీ తయారు చేసిన సీఎం చంద్రబాబు (Video)

chandrababu
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ లబ్దిదారుడు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేశారు. ఆ తర్వాత ఆ కాఫీని ఆయన సేవించడంతో పాటు ఆ లబ్దిదారుడు కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చారు. ఆ తర్వాత వారికి నెలవారి పెన్షన్ సొమ్మును పంపిణీ చేశారు. ఒకటో తేదీకి ఒక రోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను మంగళవారం పంపిణీ చేసిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన పల్నాడు జిల్లాలో జరిగిన పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 66,77,943 మంది లబ్దిదారులకు పింఛన్ల కోసం రూ.2717 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పింఛన్ల పంపిణీ మంగళవారం మధ్యాహ్నానికి 90 శాతం మేరకు పూర్తి చేశారు. 
 
ఈ పింఛన్ల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా యలమందలో ఆయన పర్యటించి, శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆమె భర్త చనిపోయారు. వారి కుటుంబ పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ చదువుతున్న శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ షాపు పెట్టుకుంటానన్న ఆమె కుమారుడుకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష రుమం, మరో రూ.2 లక్షలు సబ్సీడీగా ఇప్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.