సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 13 నవంబరు 2021 (21:17 IST)

అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్

మూడు రోజుల ప‌ర్య‌ట‌న కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్ర‌ప్ర‌దేశ్ చేరుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలసి సీఎం జగన్‌.. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.


తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్‌షాకు సీఎం జగన్‌ స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం జగన్‌, అమిత్‌షా తిరుమలకు బయలుదేరారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్‌ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు.
 
 
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్‌ శిరీష స్వాగతం పలికారు.