ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (14:20 IST)

ఏపీ వంటి చిన్నరాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.. సీఎం జగన్

jagan
ఆంధ్రప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రాని భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆయన బుధవారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో రూ.1790 కోట్ల వ్యయంతో నిర్మించిన రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. ఒక పరిశ్రమ రాష్ట్రానికి రావడం వల్ల మేలు జరుగుతుందన్నారు. 
 
స్థానికంగా ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల పరిశ్రమలో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీనే ఓ మంచి ఉదాహరణ అని చెప్పారు.