శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (09:56 IST)

పోలీసులం - మాకు కులం లేదు.. జగన్‌పై మండిపడ్డ డిజిపి

వై.ఎస్.జగన్ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించారు ఎపి డిజిపి ఠాగూర్. పోలీసులకు కులం లేదని, కష్టపడి, నిజాయితీగా పనిచేయడమే  పోలీసులకు తెలుసునని ఘాటైన సమాధానమిచ్చారు. సీనియారిటీని బట్టే పోలీసులకు పదోన్నతులు ఇస్తున్నారని స్పష్టం చేశారు. జగన్ ఫిర్యాదు తరువాత తనకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు ఎపి డిజిపి.
 
పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామన్నారు ఎపి డిజిపి ఠాగూర్. ఎపిలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. మావోయిస్టుల కదలికలను క్షుణ్ణంగా గమనిస్తున్నామని, ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా అడ్డుకుంటామన్నారు. తిరుపతిలో ఆరు రాష్ట్రాల డిజిపిల సమావేశం తరువాత ఎపి డిజిపి మీడియాతో మాట్లాడారు.