ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (14:02 IST)

ఏపీ ఎంసెట్ ఫలితాలు... ఇంజనీరింగ్‌లో పినిశెట్టి.. మెడికల్‌లో స్వాతికి ఫస్ట్ ర్యాంకు

ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి  ఛైర్మన్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో పినిశెట్టి రవితేజకు మొదటి ర్యాంకు రాగా, మెడికల్‌లో వెంకట సాయి స్వాతికి తొలి ర్యాంకు వచ్చింది. 
 
ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీల మధ్య ఈ పరీక్షను నిర్వహంచగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 282901 మంది విద్యార్థనీ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాలను విద్యార్థులకు నేరుగా ఎస్ఎంఎస్‌ల ద్వారా మొబైల్ ఫోనుకు సమాచారాన్ని చేరవేశారు. అలాగే, ఈ నెల 10వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.