డాక్టర్ గంగి రెడ్డి మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతాపం
విజయవాడ, ప్రముఖ వైద్యులు, ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మామ డాక్టర్ ఇసి గంగిరెడ్డి మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం గంగిరెడ్డి మరణించగా, శ్రీ హరిచందన్ మాట్లాడుతూ డాక్టర్ గంగి రెడ్డి వైయస్ఆర్ కడప జిల్లాలో ప్రఖ్యాత శిశువైద్యుని గానే కాక, ప్రజా వైద్యునిగా ప్రసిద్ది చెందారని ప్రస్తుతించారు.
గంగి రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నానన్నారు. సిఎం శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి, ఆయన భార్య శ్రీమతి వై.ఎస్. భారతి, కుటుంబ సభ్యులకు గౌరవ హరి చందన్ హృదయ పూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు