ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 9 జూన్ 2018 (17:00 IST)

పవన్ కళ్యాణ్‌కు అది ఏ కంపెనీయో తెలియదు... లోకేష్ ఎద్దేవా

ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. స్థానికులకు భూములు ఇవ్వకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి భూములు కేటాయిస్తున్నారంటూ పవన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేశ్ మాట్లా

ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. స్థానికులకు భూములు ఇవ్వకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి భూములు కేటాయిస్తున్నారంటూ పవన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదన్నారు. అదో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటని పేర్కొన్నారు. 
 
ఈ కంపెనీ రాక కారణంగా ఏపీలో రెండున్నరవేల మందికి పైగా ఉద్యోగాలు వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఆ కంపెనీ రూ. 450 కోట్లు పెట్టుబడి పెడుతోందనీ, ఆంధ్రప్రదేశ్‌ ఊరికే ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌ కాలేదన్న లోకేష్, పరిశ్రమలు నెలకొల్పేందుకు తాము స్వయంగా విదేశాలకు వెళ్లి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
 
స్థానిక పారిశ్రామికవేత్తలకు అన్యాయం జరుగుతోందని పవన్‌ చేస్తున్న ప్రచారంలో సత్యం లేదన్నారు. అన్నీ తెలుసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడితే బాగుంటుందని అన్నారు. మరి దీనిపై జనసేన ఏం చెపుతుందో?