శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 8 జూన్ 2018 (19:04 IST)

పవన్ కళ్యాణ్ గుడి ఎనకా నా సామి టైపు: శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మెగా ఫ్యామిలీని శ్రీరెడ్డి మరోసారి టార్గెట్ చేసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ తల్లిపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఆ తరువాత వెనక్కి తగ్గారు. కానీ మళ్ళీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్‌‌ను నోటికొచ్చినట్లు మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌‌కు అమ్మాయిలతో

మెగా ఫ్యామిలీని శ్రీరెడ్డి మరోసారి టార్గెట్ చేసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ తల్లిపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఆ తరువాత వెనక్కి తగ్గారు. కానీ మళ్ళీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్‌‌ను నోటికొచ్చినట్లు మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌‌కు అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటే తప్ప నిద్రపట్టదన్నారు. తన ఫాంహౌస్‌లో పవన్ కళ్యాణ్‌ చేసేదంతా రాసలీలలేనని, పైకేమో పతివ్రత ఫోజు, లోపలేమో చేసేదంతా గుడి ఎనకా నా సామి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
అస్సలు ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్‌‌ను శ్రీరెడ్డి ఎందుకు టార్గెట్ చేశారో తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులకు ఇప్పటివరకు అర్థం కాలేదు. మసాజ్ అంటే అలాంటి ఇలాంటి మసాజ్‌లు కాదు అమ్మాయిలతో ఓ రకమైన పద్ధతిలో మసాజ్‌లు చేయించుకుంటారంటూ శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. 
 
పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ సమయంలో హఠాత్తుగా పవన్ కళ్యాణ్‌ పైన శ్రీరెడ్డి ఇలా ఆరోపణలు సంధించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఆమె వెనుక ఎవరైనా వుండి ఎగదోస్తున్నారేమోననే సందేహాలు వెలిబుచ్చుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో? అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అటు పవన్ ఫ్యాన్స్ గాని, పవన్ కళ్యాణ్‌ గానీ స్పందించలేదు. వరుసగా రోజుకొక నటుడిని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేస్తుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది.