గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (18:27 IST)

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి గుండెపోటు?

kotamreddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి కోటంరెడ్డిని పరామర్శించారు. 
 
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో జగనన్న మాట కోటంరెడ్డి బాట అనే కార్యక్రాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం 47వ రోజురు చేరుకుంది. శుక్రవారం కూడా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో విలవిల్లాడారు. ఆ వెంటనే ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.