శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (10:42 IST)

రోడ్డు ప్రమాదాలు - మరణాల్లో ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్

andhra pradesh map
రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా, గత ఐదేళ్ళకాలంలో ఏపీలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు సంభవించినట్టు కేంద్ర రహదారులు, రవాణా పరిశోధనా విభాగం "భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2020" అనే పేరుతో ఓ నివేదికను తయారు చేసింది. ఇందులో కీలక విషయాలను గణాంకాలతో సహా వివరించింది. 
 
ఈ నివేదిక ప్రకారం గత 2016-20 మధ్యకాలంలో రాష్ట్రంలో 1,16,591 ప్రమాదాలు జరుగగా, 39,180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 2020 సంపత్సరంలో 19,509 ప్రమాదాలు జరుగగా అందులో 7039 మంది చనిపోయారు. 
 
ఇకపోతే అతివేగం కారణంగా చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొది. 2020లో ఓవర్ స్పీడ్ వల్ల 5,227 మంది మృత్యువాతపడినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 11.30 శాతం ఏపీలోనే సంభవించడం గమనార్హం.