గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (13:30 IST)

ఏపీలో ఖాళీ అవుతున్న బ్యాంకు ఖాతాలు.. ఎందుకో తెలుసా?

bank employee
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. దీనికి కారణం ఏపీ ప్రభుత్వం చేపట్టిన కులగణన కోసం సేకరిస్తున్న వేలిముద్రలని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. కులగణన పేరుతో ప్రతి ఒక్కరి వేలి ముద్రలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. కులగణన కోసం వేలిముద్రలు తీసుకున్న కొన్ని గంటల్లోనే అనేక మంది బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు డెబిట్ అవుతున్నాయి. దీంతో పలువురు బాధితులు బ్యాంకులకు వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా కోనసీమ జిల్లా రావులపాలెంలో ఈ ఘటన జరిగింది. 
 
స్థానికల కథనం మేరకు... గత నెల 31వ తేదీన పొడగట్లపల్లిలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేసుకుని వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోని వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కట్ అయినట్టు మొబైల్ ఫోన్లకు సందేశాలు వచ్చాయి. దీంతో వారు బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు.
 
అలాగే, రావులపాలెంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూక్రయ విక్రయాలు చేసేవారు కూడా ఈకేవైసీకి వేలిముద్రలు సేకరించారు. ఇలా వీటిని తీసుకున్న కొద్దిసేపటికే వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయినట్టు మెసేజ్‍లు వచ్చాయి. వెదిరేశ్వరంలో 10 మందికి, రావులపాలెంలో 15 మందికి ఇలాంటి సందేశాలు వచ్చాయి. దీంతో వీరంతా బ్యాంకులకు పరుగులు తీసి... సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.