సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (09:35 IST)

వైకాపా రంగుల పిచ్చి ... శవాల గదినీ వదిలిపెట్టని నేతలు

Mortury room
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా నేతలు సొంత పార్టీ రంగుల పిచ్చి బాగా ముదిరిపాకానపడిందనే విమర్శలు విపక్ష నేతలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను నిజం చేస్తేలా వైకాపా నేతల ప్రవర్తన ఉంది. తాజాగా శవాల గదికి కూడా వైకాపా రంగులు వేయించారు. ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వం ఆస్పత్రికి చెందిన శవాల గదికి వైకాపా రంగులు వేసి సంబరాలు జరుపుకున్నారు. 
 
నాయుడుపేటలో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రివుంది. ఈ ఆస్పత్రి అభివృద్ధి పనుల కోసం నాబార్డు రూ.5.13 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆస్పత్రి అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వివిధ రకాలైన నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, ఈ భవనం లోపల పనులు పూర్తికాకపోయినప్పటికీ ఆస్పత్రి ప్రారంభానికి మాత్రం అధికార వైకాపా నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. భయం బయట వైకాపా రంగులు వేస్తున్నారు. 
 
ఎన్నికల కోడ్ వస్తుందని, త్వరగా ప్రారంభించాలని వైకాపా నేతలు తహతహలాడుతున్నారు. దీనిపై డీఈ సాంబశివరావుకు వివరణ కోరగా మరో 20 రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఆస్పత్రికి వేస్తున్నవి పార్టీ రంగులు కావని, నిబంధనల మేరకు వాటిని వేస్తున్నామని తెలిపారు.