ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 5 మార్చి 2018 (19:24 IST)

19 అంశాలు కేంద్రం పరిష్కరించాలి... డొక్కా మాణిక్యవరప్రసాద్

అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని వాటితోపాటు హామీ ఇచ్చిన 19 అంశాలను కేంద్రం పరిష్కరించాలని శాసనసమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. 5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను దృష్

అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని వాటితోపాటు హామీ ఇచ్చిన 19 అంశాలను కేంద్రం పరిష్కరించాలని శాసనసమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. 5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. 
 
ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ వినూత్న రీతిలో ప్రసంగించారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వ తీరుని ఆయన అభినందించారన్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఖరిని దృష్టిలో పెట్టుకొని పాదయాత్ర కంటే శాసనసభ పవిత్రమైనదన్నారు. ఏ సమస్యనైనా సభలో చర్చించి పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో ప్రతిపక్షంవారు పునరాలోచించుకోవాలన్నారు.
 
తానూ దళిత కులానికి చెందినవాడినేనని, ఉన్నత కులాలవారు ఎవరూ తనని ఎప్పుడు తక్కువగా చూడలేదని డొక్కా తెలిపారు. ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలసి పనిచేశానని, వాళ్ల ఇంట్లో మనిషిలా, సొంత తమ్ముడిలా చూసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత తమ్ముడిలా గౌరవిస్తారన్నారు. లోకేష్ బాబు అన్నగా భావిస్తారని చెప్పారు.