సోఫాలో కూర్చొంటూ వెనక్కి పడిపోయిన అచ్చెన్న ...
తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు కిందపడిపోయారు. సోఫాలో కూర్చొంటూ ఒక్కసారిగా వెనక్కి వాలిపోయారు. ఆయనతో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా కిందపడ్డారు. అయితే, వారిద్దరికీ ఎలాంటి గాయాలు తగల్లేదు. దీంతో అక్కడవున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న పేరుతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. దానికి సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఆపశృతి చోటుచేసుకుంది. అయితే బాబాయ్ అబ్బాయిలిద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వెనకాల ఉన్న సోఫా దూరంగా ఉండడంతో ఇద్దరికీ ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్లు వారిని పైకి లేపారు. ఆ తర్వాత యధావిధిగా పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగింది.