బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 మే 2020 (08:54 IST)

ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడుపు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.

ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీ ఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును జూన్‌ 15 వరకు పొడిగించినట్లు ప్రకటించింది.

ఈ మేరకు ఎలాంటి ఆసల్య రుసుం లేకుండా జూన్‌ 15 వరకు ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపింది.