బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 1 అక్టోబరు 2020 (16:58 IST)

బాల‌య్య ఔదార్యం, బాధిత కుటుంబానికి రూ.1.5 ల‌క్ష‌ల ఆర్ధిక‌సాయం

ఇటీవ‌ల అనంత‌పురం జిల్లా చిల‌మ‌త్తూరు మండ‌లంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో కోడూరు కాల‌నీకి చెందిన టీడిపి నాయ‌కుడు న‌ర్సింహ‌ప్ప అనే వ్య‌క్తి మృతి చెందారు. స్థానిక నాయ‌కుల ద్వారా ఈ విష‌యం తెలుసుకున్న‌ హిందూపురం శాస‌న‌స‌భ్యుడు, అగ్ర క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఆ కుటుంబానికి రూ.1.5ల‌క్ష‌లు ఆర్థిక సాయం అందించి అండ‌గా నిలిచారు.
 
ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఆదేశాలతో స్థానిక నాయ‌కులు మృతుడి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే అందించిన రూ. 1.5 ల‌క్ష‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండును కుటుంబ స‌బ్యులకు అంద‌జేశారు.అనంత‌రం మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను ఫోనులో ప‌రామ‌ర్శించిన నంద‌మూరి బాల‌కృష్ణ వారికి మ‌నోధైర్యాన్ని అందించారు.
 
అలాగే పిల్ల‌ల‌ను బాగా చ‌దివించుకోవాల‌ని అందుకు అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని అభ‌య‌మిచ్చారు. అదేవిధంగా స్థానిక టీడిపి నాయ‌కులు ఆ కుటుంబానికి త‌మ వంతుగా ఆర్ధిక‌స‌హాయం అందించారు. తమ‌ కుటుంబానికి అండ‌గా నిలిచినందుకు మృతుని కుటుంబ స‌భ్యులు నంద‌మూరి బాల‌కృష్ణ‌గారికి, స్థానిక టీడిపీ నాయ‌కులకు కృతజ్ఞ‌త‌లు తెలిపారు.