సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 16 సెప్టెంబరు 2020 (17:14 IST)

నాగబాబు - బాలయ్య కలిసిపోయారా..?

చిరంజీవి, నాగార్జునలతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు వీళ్లందరూ భూములు కోసం కలుసుకున్నారని బాలయ్య విమర్శించడం.. అప్పట్లో ఇటు సినీ వర్గాల్లోను అటు రాజకీయ వర్గాల్లోను సంచలనం అయ్యింది. ఆ తర్వాత నాగబాబు ఎంటరై బాలయ్యపై విమర్శలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
 
ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ వివాదం చల్లబడింది. అయినా... అప్పుడప్పుడు నాగబాబు సమయం వచ్చినప్పుడు బాలయ్యపై కామెంట్ చేస్తుండే వారు. అయితే ఏమైందో ఏమో కానీ.. నాగబాబు పవన్ కళ్యాణ్ - బాలకృష్ణ కలిసి ఉన్న ఓ స్టిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నా ఇద్దరు సోదరులు. మొదటి వ్యక్తి నా సోదరుడు, రెండో వ్యక్తి మరో సోదరుడు. నందమూరి సింహాన్ని పవర్ స్టార్ కలిసిన రోజు అని కామెంట్ పెట్టారు. 
 
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటో బయటకు వచ్చినప్పటి నుంచి నాగబాబు - బాలయ్య కలిసిపోయారు అని వార్తలు వస్తున్నాయి. ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుని వార్తల్లో నిలిచిన నాగబాబు, బాలయ్య ఇప్పుడు కలిసిపోయారు అనే వార్త చర్చనీయాంశం అయ్యింది. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై నాగబాబు మరోసారి స్పందిస్తారేమో చూడాలి.