శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 17 నవంబరు 2016 (21:10 IST)

భార‌తీయ భాష‌ల్లో బీబీసీ న్యూస్‌... తెలుగులో కూడా...

లండన్‌: బీబీసీ న్యూస్ మ‌నం ఇక తెలుగులోనూ విన‌వ‌చ్చు. బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ ప్రపంచవ్యాప్తంగా మరో 11 భాషల్లో అందుబాటులోకి రానుంది. 1940 తర్వాత బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ చేపట్టిన అతిపెద్ద విస్తరణ ఇదేనని సంస్థ పేర్కొంది. వీటిలో మన భార‌తీయ‌ భాషలైన తెలుగు

లండన్‌:  బీబీసీ న్యూస్ మ‌నం ఇక తెలుగులోనూ విన‌వ‌చ్చు. బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ ప్రపంచవ్యాప్తంగా మరో 11 భాషల్లో అందుబాటులోకి రానుంది. 1940 తర్వాత బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ చేపట్టిన అతిపెద్ద విస్తరణ ఇదేనని సంస్థ పేర్కొంది. వీటిలో మన భార‌తీయ‌ భాషలైన తెలుగు, పంజాబీ, గుజరాతీ, మరాఠి ఉన్నాయి. ఈ కొత్త సర్వీసులను 2017లో ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
1932లో బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ ఓ రేడియో ఛానల్‌గా ఆంగ్ల భాషలో ప్రారంభమైంది. ఇది దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 29 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. వారానికి 249 మిలియన్‌ ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తోంది. ‘ఈరోజు బీబీసీలో ఓ చరిత్రాత్మక రోజు. 1940 తర్వాత పెద్ద విస్తరణ కార్యక్రమాన్ని మేం ప్రకటించాం’ అని బీబీసీ డైరెక్టర్‌ జనరల్‌ టోనీ హాల్‌ తెలిపారు.
 
విస్తరణ అనంతరం మొత్తం 40 భాషల్లో ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. 2022 వరకు 500 మిలియన్‌ ప్రజలకు తమ ప్రసారాలు చేరువకావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త భాషల్లో ప్రసారాల కోసం 289 మిలియన్‌ పౌండ్ల పెట్టుబడి పెడుతున్నారు. కొత్తగా 1300 ఉద్యోగాల కల్పన ఈ విస్త‌ర‌ణ వ‌ల్ల సాధ్యం అవుతుంది