మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 నవంబరు 2024 (10:52 IST)

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

Kiccha Sudeep
Kiccha Sudeep
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ "మ్యాక్స్". వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్ పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. మ్యాక్స్ చిత్రం తెలుగులో డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.
 
"మ్యాక్స్" చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు  హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.
నటీనటులు - కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులు