శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2024 (13:50 IST)

సీరియస్ పాయింట్ సిల్లీగా చెప్పిన మెకానిక్ రాకీ -రివ్యూ

Naresh, viswak sen
Naresh, viswak sen
నటీనటులు : విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్, హర్ష వర్ధన్, ఆది, హర్ష చెముడు.
 సాంకేతికత: సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి, సంగీత దర్శకుడు : జేక్స్ బిజోయ్, ఎడిటింగ్ : అన్వర్ అలీ, దర్శకుడు : రవితేజ ముళ్ళపూడి, నిర్మాత : రామ్ తళ్లూరి
 
కథ:
హైదరాబాద్ లోని ఓ గ్యారేజ్ అధినేత సీనియర్ నరేష్. అతని కొడుకు రాకీ (విశ్వక్ సేన్). గ్యారేజ్ లోనే మెకానిక్ గా కొడుకుని పనిచేయిస్తాడు. కారుడ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. అలా మాయా(శ్రద్ధా శ్రీనాథ్) కు డ్రైవింగ్ నేర్పిస్తూ తన గతాన్ని కథగా చెబుతాడు. కాలేజీ లైఫ్ లో క్రికెటర్ అవ్వాలనుకునే ఓ స్నేహితుడు, అతని చెల్లెలు ప్రియా(మీనాక్షి చౌదరి)తో సరదాగా గడుస్తుండగా షడెన్ గా స్నేహితుడు ఆత్మహత్యచేసుకుంటాడు. ఆ విషయం రాకీకి తెలీదు. ప్రియా ఓసారి డ్రైవింగ్ నేర్చుకోవడానికి రాకీ దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆమెకు నేర్పించే క్రమంలో స్నేహితుడు గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. అందుకే స్నేహితుడి చావుకు కారకులైనవారిని మోసంతో ఎలా బుద్ధిచెప్పాడు? రంకిరెడ్డి(సునీల్) వల్ల వచ్చిన సమస్య ఏంటి? అన్నది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ముఖ్యంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా వున్న సమస్యను దర్శకుడు తీసుకున్నాడు. ఆన్ లైన్ లో జరిగే రకరకాల మోసాలపై పలు సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఇందులో తండ్రి చనిపోతే వారి వారసులకు కోట్ల రూపాయల ఇన్యూరెన్స్ వచ్చిందని చెప్పి అందుకు రకరకాల ఫీజులు రూపంలో దండుకొనే ఓ ముఠా గట్టు రట్టుచేసేది ఆసక్తికరమైన పాయింట్. ఈ విషయం ప్రేక్షకుడికి తెలియాలంటే మొదటి పార్ట్ చాలా ఓపిగ్గా చూడాల్సిందే. ఇద్దరు హీరోయిన్లు, హీరోతోపాటు, కమేడియన్ హర్ష, సీనియర్ నరేష్ మధ్య సాగే సన్నివేశాలు కొన్ని చోట్ల చాలా సిల్లీగా అనిపిస్తాయి. సీరియల్ తరహాలో కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి. కొన్నింటికి అప్పటికప్పుడు రాసుకున్నట్లుగా వుంటాయి.
 
నటనాపరంగా విశ్వక్ సేన్ తన శైలిలో బాగా చేశాడు. మెకానిక్ గా మాస్ తరహాలో కథను నడిపించాడు. మీనాక్షి చౌదరి డీసెంట్ రోల్ లో కనిపించి మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. కానీ శ్రద్దా శ్రీనాథ్ మాత్రం తన రోల్ తో ఇంప్రెస్ చేస్తుంది. ఇతర పాత్రలు పర్వాలేదు. 35 ఫేమ్ నటుడు విశ్వదేవ్ రాచకొండ రాకీ స్నేహితుడిగా నటించాడు.
 
సీనియర్ నరేష్ తో సాగే క్లయిమాక్స్ ఎపిసోడ్ చాలా సిల్లీగా వుంటుంది. హీరో తన తాతగురించి చెప్పే సన్నివేశాలు కూడా అలానే వుంటాయి. జూనియర్ ఆర్టిస్టును ఫ్యాక్టనిస్ట్ గా చూపించి సాగే సన్నివేశాలు పెద్ద బలంగా అనిపించవు. 
 
ప్లస్ పాయింట్స్:
ఇన్సూరెన్స్ పేరుతో జరిగే ఆన్ లైన్ మోసాలు
అక్కడక్కడా ఫన్ క్రియేట్ చేసే సన్నివేశాలు
ఆన్ లైన్ మోసాలకు యువత ఎలర్ట్ గా వుండేలా చేయడం
రాకీ ఇచ్చిన ట్విస్ట్
 
మైనస్ లు..
సీనియర్ పాయింట్ చాలా సిల్లీగా సినిమాటిక్ గా చూపించడం
తండ్రి పేరుతో ఇన్యూరెన్స్ వుందని ఫోన్ వస్తే కనీసం తల్లికికూడా చెప్పకుండా కొడుకు లక్షలకు లక్షలు మోసగాళ్ళకు ఇవ్వడం.
సీనియర్ నరేష్ ను బయకుటరావద్దన్నా వినకుండా బయటకు వచ్చే సన్నివేశం క్రుతంగా వుండడం.
ఫస్టాఫ్ అయితే చాలా పేలవంగా అనిపిస్తుంది. ఇంకా కథనం కూడా దాదాపు గెస్ చేసే విధంగా కూడా అనిపిస్తుంది.
 
ఇంతకుముందు బ్యాంక్ లోన్ పేరుతో కస్టమర్లను ఎటి.ఎం. కార్డ్ ద్వారా, ఇతరత్రా ఎలా మోసం చేస్తారో చూపించే సినిమాలు వచ్చాయి. అయితే ఈసారి లేని ఇన్ సూరెన్స్ వుందని నమ్మించే ముఠా కూడా సొసైటీ వుందనీ, అందుకు జాగ్రత్తగా వుండాలని చెప్పడం బాగుంది. కానీ అందులో పోలీసులు కూడా ఇరుక్కుపోవడం మరో ట్విస్ట్.  
 
జేక్స్ బిజోయ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు బాగున్నాయి. అలాగే మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని షాట్స్ లో మంచి ఫ్రేమ్స్ ని తాను చూపించాడు. అలాగే అన్వర్ అలీ ఎడిటింగ్ లో సాంగ్స్ ని కట్ చేయాల్సింది. పాయింట్ చిన్నది కావడంతో మొదటి భాగమంతా సిల్లీగా కాకుండా మరింత ఆసక్తితో చూపిస్తే బాగుండేది.
రేటింగ్ : 1.75/5