బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (06:41 IST)

ఎన్టీఆర్‌కు భారతరత్నపై కేంద్రం స్పందన ఏమిటంటే....

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి. రామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇదే అంశంపై టీడీపీ నేతలు లోక్‌సభ వే

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి. రామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇదే అంశంపై టీడీపీ నేతలు లోక్‌సభ వేదికగా తమ వంతు కృషి చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని జులై 19న లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. 377 నిబంధన కింద ఎన్టీఆర్‌కు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కృషి చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో నాని డిమాండ్‌పై తాజాగా హోంశాఖ తన స్పందన తెలియజేసింది. భారతరత్న ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలను పీఎంవోకు పంపినట్లు కేశినేని నానికి హోంశాఖ సమాచారమిచ్చింది.