శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 12 నవంబరు 2016 (18:09 IST)

బ్లాక్ మ‌నీని కాల్చేసే క‌న్నా... ఉద్యోగుల‌కు జీతాలిచ్చేయ‌డం మిన్న...

హైద‌రాబాద్ : క‌రెన్సీ నోట్ల ర‌ద్దుతో ప్ర‌ధాని మోడీ సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఒక ప‌క్క బ్లాక్ మ‌నీ దాచుకున్న వారి వెన్నులో చ‌లి పుట్టించిన ప్ర‌ధాని... వారిలో ఒక ర‌కం ప‌రివ‌ర్త‌న కూడా తెచ్చార‌నిపిస్తుంది. పెద్ద నోట్ల ర‌ద్దుతో బెంబేలెత్తిన కార

హైద‌రాబాద్ : క‌రెన్సీ నోట్ల ర‌ద్దుతో ప్ర‌ధాని మోడీ సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఒక ప‌క్క బ్లాక్ మ‌నీ దాచుకున్న వారి వెన్నులో చ‌లి పుట్టించిన ప్ర‌ధాని... వారిలో ఒక ర‌కం ప‌రివ‌ర్త‌న కూడా తెచ్చార‌నిపిస్తుంది. పెద్ద నోట్ల ర‌ద్దుతో బెంబేలెత్తిన కార్పొరేట్ యాజ‌మాన్యాలు, ఉద్యోగుల‌కు పెండింగ్ జీతాలు ఇచ్చేస్తుండ‌టం విశేషం. ఎలాగూ ఈ డిసెంబ‌రు ఆఖ‌రికి 500, 1000 నోట్లు ప‌నిచేయ‌వు. ఆ డ‌బ్బు బూడిద‌లో పోసిన‌ట్లే. వాటిని ఉద్యోగుల‌కు ఇచ్చేస్తే, పండ‌గ చేసుకుంటారు అనుకున్న కొన్ని యాజ‌మాన్యాలు పెండింగ్ జీతాలు ఇచ్చేస్తున్నాయి. దీనితో వేత‌న జీవులు ప్ర‌ధాని మోడీకి కృత‌జ్ఞత‌లు చెపుతున్నారు. 
 
దీనికి మ‌చ్చుకు ఓ ఉదాహ‌ర‌ణ‌. హైదరాబాదులో సి.వి.ఆర్. న్యూస్ ఛాన‌ల్ గ‌త 5 నెల‌లుగా ఉద్యోగుల‌కు వేత‌నాలు చెల్లించ‌డం లేదు. ఇపుడు పెద్ద నోట్ల రద్దుతో యాజమాన్యం పెండింగులో ఉన్న 5 నెలల వేతనాలను ఒకేసారి చెల్లించేసింది. దానితో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. భారీగా కోతలు విధించారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక పి.ఎఫ్ బాధితులు కూడా, ఇదే మంచి తరుణమని భావించి.. సీవీఆర్ యాజమాన్యాన్ని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాగే, ప‌లు సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు అడ్వాన్సుగా జీతాలు కూడా ఇచ్చేస్తున్నాయ‌ట‌. ఎంతైనా మోడీజీ చేసిన మేలే క‌దా ఇది!