సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (16:13 IST)

బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో అనుకుంటున్నారా?

botsa
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని బొత్స చెప్పారు. 
 
బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో అనుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. బైజూస్ అంటే ఏమిటో మీ మనవడిని అడిగితే చెపుతారని అన్నారు. 
 
మమ్మీ, డాడీ అని పిలవడం కోసం ఇంగ్లీష్ మీడియం అని చంద్రబాబు అంటున్నారని... అందుకేనా మీ కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివించారు? అందుకేనా విదేశాలకు పంపించింది? అని బొత్స ప్రశ్నించారు. 
 
పేద పిల్లలకు కూడా అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలనే బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారని అన్నారు.