వీధి కుక్కల భీభత్సం.. ఆరేళ్ల బాలుడి పరిస్థితి విషమం..!
తెలుగు రాష్ట్రాలలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ఇటీవల వీధి కుక్కల దాడితో ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మరువక ముందే మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం మధ్యహ్నం ఇంటిముందు ఆడుకుంటున్న ఓ ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు విరుచుకుబడ్డాయి. వీధి కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్నబాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా వేసవిలో సంభవించే జన్యుపరమైన మార్పుల కారణంగా కుక్కలు హింసాత్మకంగా ప్రవర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇటు వైద్యాధికారులుగానీ, మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులుగానీ దృష్టిపెట్టకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనుక ఇకనైనా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.