కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర
Naveen Chandra, Kajal Chaudhary Clap by Sahu Garapati
నవీన్ చంద్ర, రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా మందలపు శివకృష్ణ నిర్మిస్తున్న తొలి చిత్రం కరాలి. ఈ మూవీకి రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆదివారంనాడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టగా, శ్రీహర్షిణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత గోరంట్ల రవికుమార్, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ తుమాటి నరసింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
సినిమా గురించి నవీన్ చంద్ర మాట్లాడుతూ... కొత్త వారు కొత్త పాయింట్‌తో వచ్చినప్పుడు సినిమాలు నిర్మించేందుకు శివ గారి లాంటి ధైర్యం ఉన్న వాళ్లు ముందుకు రావాలి. కరాలి అనే టైటిల్ ఎంత కొత్తగా, డిఫరెంట్‌గా ఉందో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇంత వరకు నేను చేయని ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామా. కాజల్ చౌదరి నటించిన అనగనగా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మా సినిమాకు మంచి టీం దొరికింది. ఇంత వరకు నన్ను ఆడియెన్స్, మీడియా ఎంకరేజ్ చేస్తూనే వచ్చింది. ఈ మూవీని ఆడియెన్స్ అంతా ఎంజాయ్ చేసేలా రూపొందిస్తున్నామని అన్నారు.
చిత్ర నిర్మాత మందలపు శివకృష్ణ మాట్లాడుతూ... నేను కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగిని. అక్కడ వీఆర్ఎస్ తీసుకుని సినిమాల మీద ప్యాషన్‌తో ఇంత వరకు కూడబెట్టుకున్న డబ్బులతో ఇక్కడకు వచ్చాను. నాకున్న ప్యాషన్‌తోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఆ టైంలోనే రాకేష్ పొట్ట గారు కథను చెప్పారు. నాకు ఆ కథ చాలా నచ్చింది. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం. కొత్త యాక్షన్ మూవీని అందరి ముందుకు తీసుకు వస్తాం. నాకు ఇది ఫస్ట్ మూవీ అయినా సరే నా మీద నమ్మకంతో ముందుకు వచ్చి నవీన్ చంద్ర గారికి థాంక్స్ అని అన్నారు.
చిత్ర దర్శకుడు రాకేష్ పొట్టా మాట్లాడుతూ.... నవీన్ సర్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. నన్ము నమ్మి అవకాశం ఇచ్చిన ఆయనకు థాంక్స్. నేను చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో నిర్మించేందుకు వచ్చిన శివ గారికి థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మేం చాలా నమ్మకంగా ఉన్నాం అని అన్నారు.
హీరోయిన్ కాజల్ చౌదరి మాట్లాడుతూ.... ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా ఉండబోతోంది. నాకు స్క్రిప్ట్ చాలా నాకు నచ్చింది. నవీన్ చంద్ర గారి సినిమాలు, ఆయన ఎంచుకునే కథలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. మళ్లీ ఈ మూవీతో మంచి కథతో మీ అందరి ముందుకు రాబోతోన్నాం. నాకు అవకాశం ఇచ్చిన శివ గారికి, రాకేష్ గారికి థాంక్స్ అని అన్నారు.
నటీనటులు : నవీన్ చంద్ర, రాశి సింగ్ , గరుడ రాముడు, రాజా రవీంద్ర , వెంకటేష్ ముమ్మిడి తదితరులు