మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 2 మార్చి 2017 (06:25 IST)

ఏపీలో మరో బస్సు ప్రమాదం : 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సుప్రమాదం జరిగింది. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు బస్సు ప్రమాద ఘటనలో నెత్తుటిచారలు ఆరకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 75 మంది స్కూల్‌ విద్యార్థులు ప్

ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సుప్రమాదం జరిగింది. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు బస్సు ప్రమాద ఘటనలో నెత్తుటిచారలు ఆరకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 75 మంది స్కూల్‌ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు 40 అడుగుల బ్రిడ్జిపైనుంచి బోల్తాపడింది. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదాలవలపాడు వద్ద గురువారం తెల్లవారుజాము 3-15 గంటలకు ఈ సంఘటన జరిగింది.
 
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కరేడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థులను కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
బస్సు కల్వర్టులో పడిపోతే, ప్రమాదం జరిగితే అధికారులేం చేస్తారు అంటూ వెనకేసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒక బస్సులో 75 మంది పిల్లల్ని కుక్కి విహార యాత్రలు చేయిస్తున్న మన రవాణా వ్యవస్థను కూడా ఇదే విధంగా సమర్థించుకుంటూ పోతారేమే. ఇంతకూ నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ఏమైంది?