సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:56 IST)

సెల్ షాపు యజమానికి నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

హనుమకొండలో దారుణం జరిగింది. ప‌ట్ట‌ణంలోని కాంగ్రెస్ భవన్ ఎదురుగా ఉన్న సెల్ షాప్ యజమాని పై అగంతుకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దురాగ‌తానికి పాల్ప‌డ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.

సెల్ ఫోన్ షాపులోంచి మంటలు రావడాన్ని గమనించిన పక్క షాపు వాళ్లు, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. స్థానికులు భ‌యందోళ‌న‌ల‌తో కేక‌లు పెట్టారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుచ్చారు.

తీవ్రంగా గాయపడిన షాపు యజమానిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఈ దురాగ‌తానికి పాల్ప‌డింది ఎవ‌ర‌నే విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.