వాహనాలు పల్టీ... పులివెందుల బ్రిడ్జి వద్ద పోలీస్ పహారా!
అనంతపురం జిల్లాలో వాగులు, వంకలు ప్రవహిస్తున్న నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో బ్రిడ్జిల వద్ద కాపలా ఉంటున్నారు. రహదారులపై వరదనీటి ఉదృతితో ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలో నిన్నటి నుండి కొన్ని మండలాలలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల్లో జోరుగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీనితో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాలతో ప్రజలు, వాహనాల చోదకులు ఇబ్బంది పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
జిల్లాలోని ముదిగుబ్బ- పులివెందుల రహదారి, విడపనకల్లు మండలం డొనేకల్లు వద్ద జాతీయ రహదారి, తదితర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను, గ్రామీణులను అప్రమత్తం చేస్తున్నారు. పులివెందుల బ్రిడ్జి వద్ద వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీనితో అప్రమత్తం అయి పోలీసులు వాహనదారులు బ్రిడ్జి దాటకుండా జాగ్రతగా కాపలా ఉంచారు.