గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:37 IST)

పారాలింపిక్స్‌లో పతకాల పంట : మనీష్‌కు స్వర్ణం, సింఘరాజ్‌కు రజతం

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో శనివారం భారత్‌కు వరసగా రెండు పతకాలు లభించాయి. షూటర్లు మనీష్ నర్వాల్, సింఘరాజ్ అదానాలు రెండు పతకాలు సాధించారు. 
 
ఈ పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన పురుషుల పి 4 మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్.హెచ్ 1 పోటీల్లో మనీష్ నర్వాల్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే, సింఘరాజ్ అదానా రజతపతకం సాధించారు.
 
దీంతో టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. మరోవైపు, ఇప్పటివరకు భారత్‌కు పారా ఒలింపిక్స్‌లో 15 పతకాలు భారత్ ఖాతాలో వచ్చిచేరాయి. 
 
మరోవైపు, 19 ఏళ్ల షూటర్ మనీష్ పారా ఒలింపిక్ రికార్డు సృష్టించాడు. మనీష్ బంగారు పతకం కైవసం చేసుకోవడానికి 218.2 పాయింట్లు సాధించాడు, సింఘరాజ్ 216.7 పాయింట్లతో టోక్యో పారా ఒలింపిక్స్‌లో తన రెండో పతకాన్ని సాధించాడు. రష్యన్ పారాలింపిక్ కమిటీ సెర్గీ మలిషేవ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.