సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (20:27 IST)

ఎమ్మెల్యేలతో రాజీనామాలకు రెడీ.. చంద్రబాబు సంచలన ప్రకటన

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు కూడా రెడీగా ఉన్నామని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా కాపాడేందుకు తాము రాజీనామాలు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనకు చంద్రబాబు మద్దతు పలికారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీనామాలపై ప్రకటన చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం పల్లా శ్రీనివాస్ 6 రోజులు దీక్ష చేశారు. విశాఖకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రజల భావోద్వేగాలను ప్రభుత్వం తెలుసుకోవాలి. 
 
వైకాపాకు 22 మంది ఎంపీలు ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం మీరు ఏం చెప్పినా చేయడానికి మేం రెడీ. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాజీనామాలకూ మేం సిద్ధం. అని చంద్రబాబునాయుడు ప్రకటించారు. విశాఖ ఉక్కు కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, తెన్నేటి విశ్వనాథం ఎంతో కృషి చేశారన్నారు.