గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మే 2022 (12:32 IST)

నారాయణ అరెస్టుపై గవర్నర్ - అమిత్ షాకు లేఖ రాసిన చంద్రబాబు

cbn4
తెలుగుదేశం పార్టీ  సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ హరిచందన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నారాయణను అరెస్టు చేసిందని లేఖలో చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 
 
అమిత్ షా జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి పోలీసులు నారాయణను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేసి చిత్తూరుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. 
 
అయితే, ప్రశ్నపత్రాలు లీకే కాలేదని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెబుతుంటే ప్రశ్నపత్రాల లీక్ కేసులో నారాయణను అరెస్టు చేసినట్టు ఏపీ సీబీఐ చెప్పడం వింతగా ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. 
 
ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అరెస్టు చేశారని బాబు తన లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు ఎస్పీ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. 
 
ఈ సందర్భంగా వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు ఘటనను కూడా బాబు తన లేఖలో ప్రస్తావించారు. కాగా, ఈకేసులో నారాయణకు బెయిల్ లభించిన విషయం తెల్సిందే.