బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (08:58 IST)

నోరెళ్లబెట్టొద్దు... కరక్కాయలతో రూ.కోట్ల మోసం..

మోసగాళ్లు ఏదో విధంగా అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా, కరక్కాయలతో కూడా కోట్ల రూపాయల మోసం చేశారు. కరక్కాయలతో మోసం ఎలా చేస్తారని మాత్రం నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోవద్దు. ఈ ఘరానా మోసం జరిగింది కూడ

మోసగాళ్లు ఏదో విధంగా అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా, కరక్కాయలతో కూడా కోట్ల రూపాయల మోసం చేశారు. కరక్కాయలతో మోసం ఎలా చేస్తారని మాత్రం నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోవద్దు. ఈ ఘరానా మోసం జరిగింది కూడా ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు సుమా.. ఏకంగా హైదరాబాద్ మహానగరం నడిబొడ్డునే.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నిజానికి ఆయుర్వేదంలో కరక్కాయలు పొడికి మంచి డిమాండ్ ఉంది. దీన్నే సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తమ ఆయుధంగా ఎంచుకుంది. ఈ కంపెనీ పేరుతో పలు పత్రికలతో పాటు యూట్యూబ్, వెబ్‌ మీడియాలో విస్తృతంగా పబ్లిసిటీ ఇచ్చారు. కరక్కాయ పొడి ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారని, దీనికి మంచి డిమాండ్ ఉందంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. 
 
పైగా, తామ కంపెనీ సరఫరా చేసే కరక్కాయలను శూర్ణం చేసి ఇస్తే కేజీకి 300 రూపాయలు చెల్లిస్తామంటూ ఆ యాడ్‌లో పేర్కొన్నారు. అయితే, కరక్కాయలను మాత్రం తమ వద్దే కొనుగోలు చేయాలనే షరతు విధించారు. పైగా, కేజీ కరక్కాయలకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేసింది. 
 
ఇలా వేల మంది రూ.లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి కరక్కాయాలను కొనుగోలు చేసి వాటిని పొడిగా చేశారు. తీరా కంపెనీ నిర్వాహకులు కరక్కాయలు అమ్మగా వచ్చిన డబ్బులతో పారిపోయారు. దీంతో, బాధితులంతా కరక్కాయలు, పొడి పట్టుకొని లబోదిబోమంటూ కేపీహెచ్‌బీ పోలీసుల దగ్గరికి వచ్చారు.
 
ఈ సంస్థ రెండు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాగా వేసినట్టు బాధితులు చెబుతున్నారు. బాధితులంతా పేద, దిగువ మధ్యతరగతి ప్రజలే కావడం గమనార్హం. ఇంట్లో కూర్చొని ఎంతో కొంత ఆదాయం సంపాదిస్తే వేడినీళ్లకు చన్నీళ్లలా ఉంటుందని ఆశపడితే ఆ సంస్థ ఏకంగా నిండా ముంచేసింది. దీంతో భాగ్యనగరి వాసులు లబోదిబో మంటున్నారు.