సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , గురువారం, 2 డిశెంబరు 2021 (14:14 IST)

అమ్మో! చెడ్డీ గ్యాంగ్...అపార్ట్ మెంట్ లోకి ఎలా ఎంట‌ర్ అయిందో!

అర్ధ‌రాత్రి... ఆ అపార్ట్ మెంట్ లోకి చెడ్డీ గ్యాంగ్ ఎంట‌ర్ అయింది. ఒకరు కాదు...ఇద్ద‌రు కాదు... అయిదుగురు ముసుగులు వేసుకుని ఒకరి వెనుక ఒక‌రు దోపిడీ దొంగ‌ల్లా లోనికి వ‌చ్చేశారు. మెల్ల‌గా మెట్లు ఎక్కి అపార్ట్ మెంట్ లోకి ఎంట‌ర్ అయిపోయారు. 

 
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటుపల్లి గ్రామంలో, ఓ అపార్ట్మెంట్లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. అర్ధ రాత్రి 2 గంటల సమయంలో కర్రలు చేత బట్టుకుని, చెడ్డిలపై అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన ఐదుగురు అగంతకులు ఒక‌రి వెనుక ఒక‌రు అంగ‌లు వేసుకుని లోనికి వ‌చ్చేశారు.

 
అర్ధరాత్రి అలికిడి అవ్వటంతో అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ యజమాని క్యారీడార్లో లైట్లు వేయడంతో ఆగంతకులు కంగుతిన్నారు. వెంట‌నే బ‌య‌ట‌కు ప‌రార‌య్యారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఆగంతుకుల దృశ్యాలు చూసి స్థానికులు, పోలీసులు సైతం ఖంగుతిన్నారు. వీరంతా చెడ్డి గ్యాంగ్‌గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాల‌ను చూసిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడి, నిందితుల కోసం గాలింపు మొద‌లుపెట్టారు. వీరంతా ఒక్క‌సారిగా మీద క‌ల‌బ‌డితే, ప‌రిస్థితి ఏంట‌ని అపార్ట్‌మెంట్ వాసులు గ‌డ‌గ‌డలాడుతున్నారు.