1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 19 ఏప్రియల్ 2025 (16:52 IST)

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

World liver Day 2025
2025 ప్రపంచ కాలేయ దినోత్సవం (World Liver Day 2025) సందర్భంగా, ' ఆహారమే ఔషధం' అనే థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం ముందు ఉంచింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మంచి పోషకాహార అలవాట్లను అలవర్చుకోవడం వల్ల శరీర కూర్పు, కాలేయం యొక్క జీవక్రియ స్థితి మెరుగుపడుతుంది. కాలేయం ఆరోగ్యం కోసం ఏమేమి చేయాలో తెలుసుకుందాము.
 
శరీరంలోని కాలేయం ఎన్నో కీలకమైన విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్‌రూట్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్‌లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్‌లు ఉంటాయి. సిట్రస్ పండ్లలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పసుపు వల్ల వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా కాలేయ వ్యాధులను నివారిస్తుంది.