శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:48 IST)

బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం

కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దేవిచిక్కనహల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సిలిండర్‌ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరు మంటల్లో సజీవదహనమయ్యారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గ్యాస్‌ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో అపార్‌మెంట్‌ను పొగ కమ్మేసింది.
 
సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మూడు ఫైర్‌టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో చిక్కుకుపోయిన చాలా మందిని సిబ్బంది రక్షించారు. అపార్ట్‌మెంట్‌ అంతా పొగ వ్యాపించడంతో అందులో ఉన్న జనం శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.