గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (16:24 IST)

చంద్రబాబుకు చిరంజీవి మెగా విషెస్

babu - chiru
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు బుధవారం తన 72వ పుట్టినరోజు వేడుకను జరుపుకున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయనకు అనేక మంది సినీ సెలెబ్రిటీలు విషెస్ తెలుపుతున్నారు. ఇందులోభాగంగా, మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఆయన ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. నిజానికి వీరిద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారు. చిరంజీవి తన సొంత రాజకీయ పార్టీ ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీపై పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తర్వాత ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.