గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (13:06 IST)

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం

చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వర రావుపైనా నిందితులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటనలో టీసీ సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. నిందితులను తమిళనాడుకు చెందిన వెంకటేశ్‌, విజయన్‌‌లుగా పోలీసులు గుర్తించారు. వారిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
కాగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, రాజమండ్రి, కర్నూలు వంటి పలు ప్రాంతాలలో బ్లేడ్ చేసిన ఆగడాలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా ఒంటరిగా రాత్రి సమయంలో ప్రయాణించేవారిపై దాడులకు పాల్పడి దోచుకునేవారు. ఈ క్రమంలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు.