శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 9 ఆగస్టు 2021 (11:45 IST)

పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం డ‌యాఫ్రాం వాల్ నిర్మాణానికి శ్రీకారం

ఏపీలో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యాం డ‌యాఫ్రాం వాల్ నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సోమవారం పనులు ప్రారంభించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జలవనరుల శాఖ డిఈఈ ఎం కె డి వి ప్రసాద్ తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 
 
పోల‌వ‌రం ప్రాజెక్ట్ లో 96 మీటర్ల పొడవు, 10 మీటర్ల లోతు, 1.2మీటర్ల వెడల్పుతో డ‌యాఫ్రాం వాల్ నిర్మాణ పనులు  మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రారంభించింది. దిగువ కాఫర్ ఢ్యాం నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఈ కాఫర్ ఢ్యాం పొడవు 1,613 మీటర్లు, ఎత్తు 30.5 మీటర్లు ఉంటుది. దిగువ కాఫర్ ఢ్యాం లో 63,000 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు పూర్తి. దిగువ కాఫర్ ఢ్యాం దగ్గర నదిలో గ్యాప్ లను పూడ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 
 
దిగువ కాఫర్ ఢ్యాం నిర్మాణం పై జలవనరుల శాఖ,  మేఘా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎగువ, దిగువ కాఫర్ ఢ్యాంల నిర్మాణం  అనంతరం  ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం నిర్మాణం పై దృష్టి పెడ‌తారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాగానే ఈసిఆర్ఎఫ్ పనులు మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా  పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా చురుకుగా ప‌నులు సాగుతున్నాయి.